నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు

- October 30, 2025 , by Maagulf
నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణను అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. సీఎం చంద్రబాబు  నాయకత్వంలో “నైపుణ్యం పోర్టల్” రూపుదిద్దుకుంటోంది. ఈ పోర్టల్ ద్వారా యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, సరైన ఉద్యోగాలను కూడా పొందగలరు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించారు. వైజాగ్‌లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ముందు ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు.

ఇక నుంచి ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. శిక్షణ పొందిన యువతకు అధికారిక ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. స్పేస్, ఆక్వా, క్వాంటం వంటి ఆధునిక రంగాల్లో అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. “నైపుణ్యం పోర్టల్” ద్వారా ఏఐ సహాయంతో అభ్యర్థులు తమ రెజ్యూమ్ తయారు చేసుకోవడం, వాట్సాప్ ద్వారా ఉద్యోగ సమాచారం పొందడం, అలాగే ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే సిమ్యులేటర్ సౌకర్యం వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విదేశీ ఉద్యోగావకాశాల కోసం స్థానిక భాషల శిక్షణ కూడా అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని యువత అందరికీ అవకాశాలు, శిక్షణ, ఉపాధి ఒకే వేదికపై లభించేలా ఈ నైపుణ్యం పోర్టల్ రూపుదిద్దుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com