‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- October 30, 2025
డాలస్, టెక్సస్: తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాలంలో సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 85వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “దండక సాహిత్యం – ఉనికి, ప్రాభవం” సభ విజయవంతం విజయవంతంగా జరిగింది.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన ఛందస్సు/కవితా రూపంతో కూడుకున్నవి దండకాలు.ఇవి క్రీ.శ. 10, 11 శతాబ్దాల మద్యకాలం నుండే ప్రాచుర్యంలో ఉన్నాయి. దండకాలలో పాదాల పొడవు ఎక్కువగా ఉండి, అలంకార చాతుర్యం, ఉత్సాహపూరిత శబ్దప్రభావం కల్గి ఉంటాయి. ఒకప్పుడు ప్రార్ధన, వర్ణన, స్తోత్ర రూపంలో వ్రాయబడ్డ దండకాలు ఇప్పుడు వైవిధ్యభరితమైన వస్తువులమీద, సామాజిక స్పృహ, హాస్య, వ్యంగ భరితంగా సినిమాలల్లో సైతం చోటుచేసుకుంటూ బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. అనేక ప్రాంతాలనుండి 42 మందికి పైగా కవులు, కవయిత్రులు ఈనాటి కార్యక్రమంలో పాల్గొని దండక పఠనం చేయడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అరుదైన మధుర ఘట్టం అన్నారు. పాల్గొన్న విశిష్టఅతిథులకు, ముఖ్యఅతిథి - పద్యాలంటే ఆసక్తి ఉన్నవారికి,ఎన్నో సంవత్సరాలగా ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా పద్యశిక్షణ చేస్తున్న బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు”.
ప్రముఖ సాహితీవేత్త శ్రీరాం వేగరాజు సాహితీబంధు, చందశాస్త్ర రత్నాకర, ఛందోసమ్రాట్, పద్య గురుసార్వభౌమ, బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు తెలుగు సాహిత్యచరిత్రలో ఒక అరుదైన ఆణిముత్యం అని సభకు పరిచయం చేశారు.
ముఖ్యఅతిథి బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ – “దండకాలు వివిధ భాషల్లో ఉన్నాయని, అయితే తెలుగు భాషలో ఉన్నన్ని దండకాలు ఏ ఇతర భాషల్లో లేవని, దండకాలన్నిటికీ మాతృక సంస్కృతమే అన్నారు. కొన్ని ఏకవాక్య దండకాలున్నా, సాధారణంగా దండకంలో కూడా పద్యంలో వలె నాల్గు పాదాలుంటాయని, అయితే ఒక్కో పాదంలో కనీసం 27 అక్షరాలుండాలని అన్నారు. 320 పేజీల నిడివిలో అశ్వథ్నారాయణ వ్రాసిన ఏకవాక్య రామాయణ దండకం, అలాగే ఇతర కవులు వ్రాసిన సుందరకాండ, గజేంద్ర మోక్షం దండకాలు ప్రముఖమైనవి అన్నారు. ఇప్పటివరకు సంస్కృతభాషలో ఉన్న 500 దండకాలను సేకరించగల్గామని, శృతిపేయంగా, తాళబద్ధంగా, లయాత్మకంగా సాగే దండకాలు అందరినీ ఆకట్టుకుంటాయని అన్నారు. అందుకే ఇటీవల కాలంలో వివిధ వస్తువులమీద అన్ని రసాలలోను వస్తున్న దండకాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు.
విభిన్న వస్తువులమీద మూడు గంటలపాటు ఎంతో ఉత్సాహంగా సాగిన దండక పఠనంతో ఈ క్రింది పేర్కొన్న కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.
కస్తూరి మోచర్ల, హైదరాబాద్ (గురుప్రార్థన, శ్రీగురు); గంటి బాలాత్రిపుర సుందరి, కాకినాడ (మహాదేవ); పిలకా సరోజిని, విశాఖపట్టణం (శ్రీ గణేశ); వాసా రమణి, అనకాపల్లి (సెల్ ఫోన్); మాల్యవంతం లక్ష్మీశేషు, హైదరాబాద్ (గగనగంగ); వారణాసి రామకృష్ణ, బెంగళూరు (భాస్కర); ఆకుండి (నిష్ఠల) శైలజ, రాజమహేంద్రవరం (పైడిమాంబ); డా. పిల్లలమఱ్ఱి లీల, విశాఖపట్టణం (కాఫీ); మాత గంగాభవాని, చెన్నై (శ్రీ గణేశ); రేమిళ్ల శాంతిలత, బెంగళూరు (శ్రీనాథ); రేమిళ్ల మైథిలి, బెంగళూరు (శ్రీదత్త); దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు, రాజమహేంద్రవరం (లలితా పరాభట్టారిక); బంకుపల్లి ఆశ్రీజ, అనకాపల్లి (జనా సత్యనృసింహాచార్యులు); డా. సూర్యదేవర రాధారాణి, హైదరాబాద్ (పూరీ), పలగాని గిరిజారెడ్డి, బెంగళూరు (టీ); గుంటూరు లక్ష్మీనరసమ్మ, అనకాపల్లి (పెసరట్టు); జయంతి విష్ణుప్రియ, రాజమహేంద్రవరం (చారు); కొరుప్రోలు గౌరినాయుడు, కాకినాడ (షిర్డి సాయి); కన్నేపల్లి గౌరీపతి శాస్త్రి, విశాఖపట్టణం (తిట్ల); అవధానం రఘురామ రాజు, శంకరాపురం (కిళ్లీ); శివలెంక నవదుర్గ, హైదరాబాద్ (జున్ను); కోన పద్మావతి, విశాఖపట్టణం (గురు); బంధకవి వెంకట సుబ్బలక్షి, హైదరాబాద్ (ధర్మపాల విజయము); వేగరాజు శ్రీరాం, సియాటెల్ (భార్యామణి); కొప్పాక ఆనంద్, హైదరాబాద్ (దుష్ట మంత్రి); గర్షకుర్తి అపర్ణ, హైదరాబాద్ (ప్రాణనాథ); వసుమతి జగన్నాథం, హైదరాబాద్ (గోవింద రామాయణము); డా. బల్లూరి ఉమాదేవి, ఉడుపి (అగ్ని); జొన్నలగడ్డ శ్రీనివాస్, తొత్తరమూడి (సిగరెట్); జలుబుల వెంకట రమణయ్య, తెనాలి (ఇడ్లీ); క్రొవ్విడి రాజారావు, మిన్నెసోటా (మహాత్మా గాంధీ); క్రొవ్విడి వెంకట సుబ్బలక్శ్మి, మిన్నెసోటా (మాహావిష్ణు); గరికపాటి ఉష, హైదరాబాద్ (శ్రీ ఆంజనేయ); భద్రిరాజు రమణారావు, హైదరాబాద్ (అపనిందాపహరణము); ఈమని మల్లికార్జునరావు, నెల్లూరు (ఇందిరా); డా. సత్తిరాజు కృష్ణసుందరి, హర్యానా (నాచికేతూపాఖ్యానము); వల్లూరు శ్రీవల్లి, హైదరాబాద్ (నాగ); బేతపూడి ఇందుమతి, హైదరాబాద్ (శ్రీ వెంకటేశ్వర); వేదుల (సరిపెల్ల) మధుశాలిని, రోచెస్టర్ హిల్స్ ( శ్రీరామ); నేతి శ్రీకర్, హైదరాబాద్ (కాఫీ); టివిఎల్ గాయత్రి, పూణే (శ్రీరాజరాజేశ్వరీ); నిష్ఠల నరసింహం, రాజమహేంద్రవరం (జీడిపప్పు)
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలో వీక్షించవచ్చును.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







