తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- October 30, 2025
తిరుమల: శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.
అనంతరం నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసులు అందించిన ఉపదేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజన చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







