అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్‌ ఆఫ్‌!

- October 30, 2025 , by Maagulf
అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్‌ ఆఫ్‌!

అమెరికా: అమెరికాలోని బాల్టిమోర్‌ నగరం తెలుగు జాతి సాంస్కృతిక వైభవంతో మార్మోగింది. అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో జరగబోయే 19వ మహాసభల కిక్‌ ఆఫ్‌ వేడుక అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 450 మందికి పైగా తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300కి పైగా ఆటా(ATA) ప్రతినిధులు హాజరయ్యారు.ఈ వేడుకతో పాటు ఆటా తమ 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న మహాసభలను అధికారికంగా ప్రకటించింది.

ఆటా(ATA) మహాసభల ప్రారంభ వేడుక కేవలం సాంస్కృతిక ఉత్సవమే కాకుండా, విశేషమైన ఫండ్రైజింగ్ ఈవెంట్‌గా నిలిచింది. 1.4 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడంలో ఈ కార్యక్రమం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ – “బాల్టిమోర్‌ టీమ్‌ మరియు కమ్యూనిటీ అద్భుతమైన నిబద్ధతను చూపింది. ఈ మహాసభ తెలుగు ఐక్యతకు, యువత శక్తికి కొత్త దిశ చూపుతుంది” అన్నారు. ఆటా నాయకత్వం స్థానిక ఆర్గనైజర్లు, స్పాన్సర్లు, వాలంటీర్లు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.

19వ ఆటా మహాసభల టీమ్‌ నియామకాలు
కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌లోనే ఆటా నాయకత్వం 19వ మహాసభల కోర్‌ టీమ్‌ను ప్రకటించింది.

  • కన్వీనర్‌: శ్రీధర్ బానాల (మేరీల్యాండ్)
  • కో ఆర్డినేటర్‌: రవి చల్లా (వర్జీనియా)
  • నేషనల్ కో ఆర్డినేటర్‌: శరత్ వేముల
  • డైరెక్టర్‌: సుధీర్ దమిడి
  • కో కన్వీనర్‌: అరవింద్ ముప్పిడి
  • కో నేషనల్ కో ఆర్డినేటర్‌: కౌశిక్ సామ
  • మానిటరింగ్ టీమ్ సభ్యులు: రామకృష్ణ ఆల (టెన్నెస్సీ), రఘువీర్ మారిపెద్ది (టెక్సాస్), విజయ్ కుండూరు (న్యూజెర్సీ) తదితరులు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com