అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!

- October 31, 2025 , by Maagulf
అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!

కువైట్: నేచర్ లవర్స్ కు కువైట్ గుడ్ న్యూస్ చెప్పింది. అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న సందర్శకులకు తిరిగి తెరవనున్నట్లు ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ (EPA) ప్రకటించింది.  ప్రజలకు గొప్ప పర్యావరణ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉందని తెలిపింది. అనేక రకాల పక్షులు మరియు వన్యప్రాణులకు ఈ నేచర్ రిజర్వ్ అవాసంగా ఉందని వెల్లడించింది. 

ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి KD 2 ఉంటుందని, ఒక్కో కుటుంబానికి KD 10 చొప్పున ఐదుగురు సభ్యుల వరకు అబ్జర్వేటరీని బుక్ చేసుకోవచ్చని EPA ప్రతినిధి మరియు పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం అల్-రాయ్‌కు ఒక ప్రకటనలో తెలిపారు.  అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు లేదా K-Net ద్వారా రిజర్వ్‌లో నేరుగా చెల్లించవచ్చని అల్-ఇబ్రహీం తెలిపారు.

1987లో స్థాపించబడిన అల్-జహ్రా రిజర్వ్, కువైట్‌లోని తొలి రక్షిత సహజ ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు మరియు పర్యావరణ ఔత్సాహికులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com