దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- October 31, 2025 
            మస్కట్: ఒమన్ లో పబ్లిక్ హెల్త్ మరియు ఆహార భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని అధికారులు పిలపునిచ్చారు. దోఫర్ మునిసిపాలిటీలోని ఆరోగ్య తనిఖీ విభాగం అక్టోబర్ నెలలో పబ్లిక్ హెల్త్ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సలాహ్ నగరంలో బేకరీలు, రెస్టారెంట్లు, సెంట్రల్ మార్కెట్ మరియు వివిధ ఇతర ఆహార సంబంధిత సంస్థలలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.
అక్టోబర్ నెలలో దోఫర్ మునిసిపాలిటీ ఆరోగ్య తనిఖీ బృందం మొత్తం 835 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 123 ఉల్లంఘనలు నమోదు చేశారు. 52 నోటీసులు జారీ చేయగా, 34 సంస్థలను సీజ్ చేశారు. ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!







