సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!

- October 31, 2025 , by Maagulf
సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!

రియాద్: సౌదీ అరేబియా SR269.8 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2025 మూడవ త్రైమాసికంలో SR88.5 బిలియన్ల లోటును ప్రకటించింది. అలాగే SR358.4 బిలియన్ల ఖర్చులను నమోదు చేసింది. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో రాష్ట్ర సాధారణ బడ్జెట్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ఈ సంవత్సరం ప్రారంభం నుండి మూడవ త్రైమాసికం చివరి వరకు మొత్తం ఆదాయాలు SR835 బిలియన్లకు చేరుకున్నాయి.  అయితే ఖర్చులు SR1 ట్రిలియన్లను అధిగమించాయి. అదే సమయంలో లోటు సుమారు SR181.758 బిలియన్లుగా ఉందని నివేదికలో తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com