KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- October 31, 2025 
            కువైట్: కువైట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అల్-మన్‌కాఫ్ ప్రాంతంలో KD 1 లక్ష 70వేల కువైట్ దినార్లు విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు. ఒక ఆసియా నివాసిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
ప్రవాసుడి నుంచి భద్రతా సిబ్బంది 6 కిలోల హెరాయిన్ మరియు 4 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలలో ఉన్న డ్రగ్స్ నెట్ వర్క్ తో కలిసి పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా అప్లికేషన్‌లో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ల ద్వారా మత్తుమందులను ముందుగా నిర్ణయించిన డ్రాప్-ఆఫ్ పాయింట్ల నుండి సేకరిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది.
చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కువైట్ లో డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భద్రతా కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







