మోహన్ లాల్ సినిమాలో నటిస్తున్న తారకరత్న
- July 23, 2016
మరి మలయాళ నటుడు మోహన్ లాల్ అంటే నిజంగానే నందమూరి హీరోలందరికీ వ్యామోహమో లేక మరొకటో తెలియదు గానీ.. వరుసగా ఒకరి తర్వాత ఇంకొకరు ఆయన సినిమాల్లో నటించడానికి లేదా తమ సినిమాల్లో ఆయన్ను నటింపజేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అప్పట్లో "గాండీవం" చిత్రంలో బాలకృష్ణ ఓ ప్రత్యేకగీతంలో మోహన్ లాల్ చేత స్టెప్పులేయించగా.. ప్రస్తుతం ఎన్టీయార్ "జనతా గ్యారేజ్" అనే సినిమా కోసం మోహన్ లాల్ ను ప్రత్యేక పాత్రలో నటింపజేస్తున్నాడు.
ఈ ఇద్దరు నందమూరి హీరోలూ సరిపోరాన్నట్లు ఇప్పుడు మరో నందమూరి కథానాయకుడు కూడా మోహన్ లాల్ తో కలిసి నటించనున్నాడని తెలుస్తోంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "మనమంతా" సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుండగా.. నిన్న ఆ సినిమా ట్రైలర్ ను చూసిన చాలా మంది అందులో ఉన్న తారకరత్నను గుర్తించు షాక్ అవుతున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో తారకరత్న నటిస్తున్నాడన్న విషయం ఎవరికీ తెలియదు. మరి "మనమంతా"లో తారకరత్నదీ ప్రత్యేక పాత్రా లేక గెస్ట్ రోలా అన్నది త్వరలో తెలుస్తుంది!
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







