మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!

- November 01, 2025 , by Maagulf
మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!

యూఏఈ: యూఏఈలో 50 ఏళ్లు దాటిన వారు షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు పిలుపునిచ్చారు.దీనితో స్ట్రోక్, డిమెన్షియా దూరం అవుతాయని పేర్కొన్నారు. షింగిల్స్ వ్యాక్సిన్ బాధాకరమైన వైరల్ దద్దుర్ల నివారణతోపాట గుండె జబ్బులు, మానసిక సమస్యలు, డిప్రెషన్ మరణాల ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.ఈ మేరకు IDWeek 2025లో సమర్పించబడిన పరిశోధన పత్రాలు స్పష్టం చేశాయి.  

షింగిల్స్ (హెర్పెస్ జోస్టర్) వ్యాక్సిన్ పొందిన పెద్దలకు వాస్కులర్ డిమెన్షియా ప్రమాదం 50 శాతం తక్కువ ఉంటుందని, రక్తం గడ్డకట్టే ప్రమాదం 27 శాతం తగ్గుతుందని, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం 25 శాతం తగ్గుతుందని డాక్టర్లు తెలిపారు. అదే విధంగా న్యుమోకాకల్ వ్యాక్సిన్ పొందిన వారితో పోలిస్తే 21 శాతం తక్కువ మరణ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.  

యూఏఈలో జనాభా, వయసు పెరిగే కొద్దీ కేసులు పెరుగుతున్నాయని షేక్ జాయెద్ రోడ్‌లోని ఆస్టర్ క్లినిక్‌లో స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక పోర్వాల్ తెలిపారు. 2022 యూఏఈ అధ్యయనంలో 50 ఏళ్లు పైబడిన పెద్దలలో 64 శాతం మంది షింగిల్స్ గురించి విన్నారని, కానీ దాదాపు 15 శాతం మందికి మాత్రమే టీకా గురించి తెలుసు అని, 4 శాతం కంటే తక్కువ మంది దానిని పొందారని తేలిందని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoHAP) 50 ఏళ్లు పైబడిన పెద్దలకు మరియు రోగనిరోధక శక్తి లేని రోగులకు టీకాలు వేయమని అధికారికంగా సిఫార్సు చేస్తోందని డాక్టర్ ప్రియాంక వెల్లడించారు.

షింగిల్స్ అనేది అంటువ్యాధి కానప్పటికీ, షింగిల్స్ అధికంగా ఉన్న వ్యక్తి ద్వారా చికెన్-పాక్స్ లేదా టీకా తీసుకోని వ్యక్తికి చికెన్-పాక్స్ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అని డాక్టర్ హెచ్చరించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com