ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- November 02, 2025
దోహా: ఖతార్ లో ఇటీవల సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలియని లేదా నమ్మదగని మూలాల నుండి వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ ను జారీ చేసింది.
ప్రజలు వారి పరికరాల భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అధికారిక యాప్ స్టోర్‌ల నుండి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మోసపూరితమైన లింకులు మీ డేటాను కాజేసే హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఏదైనా మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







