యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- November 02, 2025
యూఏఈ: యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై స్నేహితుడు లేదా బంధువును స్పాన్సర్ చేసేందుకు ఆదాయ పరిమితులను సడలించింది. నివాసితులు మినిమం సాలరీ అవసరాలను తీర్చినట్లయితే, మూడవ డిగ్రీ వరకు బంధువులను లేదా స్నేహితులను స్పాన్సర్ చేయవచ్చు. వీసా రకాలను బట్టి స్పాన్సర్ చేయడానికి Dh4,000, Dh8,000 లేదా Dh15,000 సాలరీ ఉండాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) స్పష్టం చేసింది.
ఫస్ట్-డిగ్రీ బంధువులైన తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి, కొడుకు, కుమార్తె లను స్పాన్సర్ చేయడానికి నెలకు కనీసం Dh4,000 సంపాదించాలి. ఇక సెకండ్-డిగ్రీ బంధువులు అయిన తోబుట్టువులు, తాతామామలు, మనవరాళ్ళు స్పాన్సర్ కోసం నెలకు కనీసం Dh8,000 సంపాదించాలి. థర్డ్-డిగ్రీ బంధువులైన మామ, అత్త, బంధువుల కోసం నెలకు కనీసం Dh8,000 సంపాదించాలి. బంధువులు కాని స్నేహితులను స్పాన్సర్ చేయాలంటే నెలకు కనీసం Dh15,000 సంపాదించాలని ఫెడరల్ అథారిటీ తెలియజేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







