వారంలో మూడు రోజుల సెలవు!

- July 23, 2016 , by Maagulf
వారంలో మూడు రోజుల సెలవు!

ఎంపీ అహ్మద్‌ లారి, వారానికి మూడు రోజుల సెలవు దినం ప్రకటించాలనే ప్రపోజల్‌ని తెరపైకి తెచ్చారు. గురువారం నుండి శనివారం వరకు సెలవు ఇవ్వడం ద్వారా తీవ్రమైన ఎండల నుంచి ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు వారంలో నాలుగు రోజుల పని దినాలు సరిపోతాయని ఆయన చెప్పారు. సెలవుల్ని మూడు రోజులకు పెంచడం ద్వారా రోడ్లపై వాహనాల వాడకం తగ్గుతుందనీ అలాగే ప్రభుత్వానికి ఖర్చులు కూడా తగ్గుతాయనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 వరకు పెరగవచ్చన్న అంచనాలతో ఈ ప్రతిపాదనకు బలం చేకూరుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com