సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!

- November 04, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!

రియాద్: సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించాడు. పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి, నిందితులు మధ్య ఆర్థిక వివాదం తలెత్తించింది. దీంతో సంయనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించాడని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్థులు నిషేధిత పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వామ్యులని నిర్ధారణ అయిందని వెల్లడించారు.

అయితే, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో భారత రాయబార కార్యాలయం ఇప్పిటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com