4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- November 05, 2025
యూఏఈ: యూఏఈలోని ముసాందం దక్షిణ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభంవించింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) యొక్క నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్టు తెలిపారు. యూఏఈ నివాసితులు భూప్రకంపనలను అనుభవించారని, అయితే, మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం పెద్దగా లేదని స్పష్టం చేసింది.
యూఏఈ పెద్ద భూకంప జోన్లో లేనప్పటికీ, అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉందని నిపుణులు తెలిపారు. ఇరాన్ మరియు ఇరాక్‌ల గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణిలో తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను ఉత్పత్తి చేస్తుందని NCMలోని భూకంప పర్యవేక్షణ విభాగం తాత్కాలిక అధిపతి మొహమ్మద్ అల్హస్సాని వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







