సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- November 05, 2025
రియాద్: సౌదీ అరేబియా విజన్ 2030 లో భాగంగా నాన్ ఆయిల్ గ్రోత్ కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగం యొక్క అద్భుతమైన సహకారాన్ని అందిస్తుందని సౌదీ కేబినెట్ ప్రశంసలు కురిపించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన రియాద్‌లో క్యాబినెట్ సమావేశం జరిగింది. సౌదీ ఆర్థిక వ్యవస్థ అధునాతన తయారీ, సాంకేతికత, పర్యాటకం, చమురుయేతర రంగాలలో గ్రోత్ ను కొనసాగించడాన్ని క్యాబినెట్ ప్రశంసించిందని మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ తెలిపారు.
2025 సంవత్సరానికి సంబంధించి మూడు వరల్డ్ ట్రావెల్ అవార్డులను గెలుచుకున్నందుకు అల్ ఉలాను కౌన్సిల్ ప్రశంసించింది. సౌదీ ప్రభుత్వం మరియు అరబ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సౌదీ మరియు కువైట్ ప్రభుత్వాల మధ్య ఆర్థిక సహకారంపై ఒక అవగాహన ఒప్పందాన్ని ఆమోదించారు. సమావేశాల సందర్భంగా పలు దేశాల సంస్థలతో సౌదీ కంపెనీల అవగాహన ఒప్పందాలను సమీక్షించారని, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







