తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..

- November 05, 2025 , by Maagulf
తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..

తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..

న్యూయార్క్: న్యూయార్క్ కొత్త మేయర్ గా డెమోక్రాట్ పార్టీకి చెందిన జోహ్రాన్ మజ్దానీ గెలుపొందారు. భారత మూలాలున్న వ్యక్తి ఈయన. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు అయిన జోహ్రాన్ హిందీ చక్కగా మాట్లాడతారు. జోహ్రాన్ కు 49శాతం ఓట్ల మెజార్టీతో న్యూయార్క్ మేయర్ గా గెలుపొందారు. విజయం అనంతరం జోహ్రాన్ మాన్టనీ చేసిన ప్రసంగంలో భారత మొదటి ప్రధాని నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ'(Tryst with Destiny) ప్రసంగాన్ని ఉటంకించారు. అతి చిన్న వయసు మేయర్ గా రికార్డు సాధించారు.

న్యూయార్క్ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు పిల్లల సంరక్షణను, ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేస్తానని జోహ్రాన్ వాగ్దానం చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉంది. అలాగే కర్ణాటకలోనూ ఈ సదుపాయం ఉంది. దీంతో జోహ్రాన్ దీన్ని కాపీకొట్టారని అనుకుంటున్నారు. అంతేకాదు మన ప్రభుత్వ పథకాలు విదేశాల్లో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తున్నాయని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం మనదేశంలో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రభుత్వాలు నడుపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com