మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ తో డైరెక్టర్ రితేష్ రానా
- November 08, 2025
సెన్సేషనల్ మత్తువదలరా కాంబినేషన్ మరోసారి అలరించబోతోంది.కల్ట్ హిట్ అయిన మత్తు వదలరాతో తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మత్తువదలరా 2 విజయాన్ని అందుకున్న రితేష్ రానా తన నాల్గవ డైరెక్షనల్ మూవీని ప్రకటించారు. యూనిక్ స్టయిల్ నరేషన్ తో ఆకట్టుకునే రితేష్ రానా మరోసారి సత్యతో జతకడుతున్నారు. ఇది ప్రేక్షకులకు మరో నవ్వుల విందును అందిస్తుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 4గా చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా వుంటుంది. సత్యతో ఆమె జంటగా కనిపించడం ప్రేక్షకులకు ఒక ఫ్రెష్‌నెస్ ఇవ్వనుంది. మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అఫీషియల్ గా చిత్రాన్ని ప్రకటిస్తూ, మేకర్స్ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. మత్తువదలరా టీం మరోసారి ఒక్కటవడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. రితేష్ రాణా మార్క్ హ్యూమర్, క్రియేటివిటీతో కూడిన పూర్తి స్థాయి లాఫ్టర్ రయట్ కోసం సిద్ధమవుతున్నారు.
రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్.
ఈ చిత్రం “వైల్డ్, విట్టీ రైడ్ విత్ అన్ ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్”గా ఉండబోతోంది.
డైరెక్టర్ రితేష్ రాణా మత్తు వదలరా యూనివర్స్ అభిమానులకు సిగ్నేచర్ ఎక్స్‌పీరియన్స్ – క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ తో రాబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది
తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు
సిబ్బంది:
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)
కథ - స్క్రీన్‌ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్స్: శ్యామ్
PRO: వంశీ - శేఖర్
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







