స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- November 08, 2025
హైదరాబాద్: మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేయాలని అన్నారు నారా భువనేశ్వరి. మహిళలకు చేయూతను ఇచ్చేలా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా మహిళలు తయారు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా
నారా భువనేశ్వరి మాట్లాడుతూ...స్త్రీ అంటే ప్రేమ, ధైర్యం, శక్తి. మహిళలకు ఒక రోజు మహిళా దినోత్సవం అని జరుపుతుంటారు.కానీ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు జూట్ బ్యాగ్స్, బ్యూటీషియన్ కోర్స్ లు, టైలరింగ్ ట్రైనింగ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీ..ఇలా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నాం. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని శిక్షణ పొందిన మహిళలు ఏం చేస్తున్నారని వెళ్లి చూస్తే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ఒక్కచోట చేర్చి, వారి ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురావాలనే ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించాం. ఈ స్టోర్ ద్వారా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. దీని ద్వారా వచ్చిన ఆదాయమంతా ఆయా మహిళలకే చెందుతుంది. మహిళ తన దగ్గర ఏ కొంత డబ్బు ఉన్నా, తన కుటుంబానికి మంచి వంట చేయాలని, ఏదో ఒకటి కొనివ్వాలని, వాళ్లను సంతోషపెట్టాలనే చూస్తుంటుంది. అలా ఒక మహిళ మాత్రమే ఆలోచించగలదు. కానీ మీ ఆదాయంలో మీరు కూడా కొంత ఖర్చు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్టు నుంచి పుష్ కార్ట్స్, ఫుడ్ కార్ట్స్, టైలరింగ్ మిషీన్స్, ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. నేను కూడా మీలాగే గృహిణిగా ఉన్నాను, ఆ తర్వాత ధైర్యంగా అడుగువేసి కంపెనీని నిర్వహిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. సునీత విలియన్స్, మేరీ కోమ్, సుధామూర్తి..ఇలా ఎందరో మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇటీవల మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెల్చింది. మీరంతా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నా. అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







