ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- November 08, 2025
బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన ఐదో టీ20 అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వర్షం మాత్రం మ్యాచ్‌ను పూర్తిగా చెడగొట్టింది. ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ దూకుడును వర్షం నిలిపేసింది. చివరికి మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించడంతో, ముందంజలో, 2-1 తేడాతో ఉన్న సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మొదటి ఓవర్ నుంచే దాడి మోడ్‌లోకి వెళ్లింది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి అద్భుతమైన ఆరంభం అందించారు. కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు నమోదు చేసారు..
గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం.. ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







