ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- November 09, 2025
మస్కట్: రాయల్ హాస్పిటల్ ఒమన్ సుల్తానేట్‌లో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని రాయల్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఖైస్ బిన్ మొహమ్మద్ అల్-హూటి అన్నారు. ఈ విజయం ఒమన్ వైద్య నైపుణ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిందన్నారు. యూరిటెరోపెల్విక్ జంక్షన్ సమస్యతో బాధపడుతున్న రోగికి మూత్రపిండ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఆపరేషన్ దాదాపు రెండు గంటలు కొనసాగిందని తెలిపారు.
యూరాలజీ, కొలొరెక్టల్ సర్జరీ, మెటర్నిటీ మరియు గైనకాలజీ, హెపాటోబిలియరీ మరియు జీర్ణశయాంతర శస్త్రచికిత్స మరియు కార్డియోథొరాసిక్ విధానాలతో సహా పలు ప్రత్యేకతలలో రోబోటిక్ సర్జికల్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని ఆసుపత్రి లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. ఆధునిక వైద్యంలో అత్యంత అధునాతన పరిణామాలలో రోబోటిక్ సర్జరీ ఒకటని, ఇందులో బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుందని డాక్టర్ ఖైస్ బిన్ మొహమ్మద్ అల్-హూటి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







