ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- November 09, 2025
దోహా: ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లను అమలు చేసే పరికరాలను ప్రభావితం చేసే కీలకమైన భద్రతా ప్యాచ్ ను గూగుల్ కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఖతార్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ కూడా ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ ప్రకారం, ఈ లోపం చాలా ప్రమాదకరమైనదని, దీనికి యూజర్ అనుమతి అవసరం లేదని, ఈ ప్యాచ్ ని 'జీరో క్లిక్'అని పిలుస్తారని పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, Wi-Fi లేదా బ్లూటూత్ ద్వారా హానికరమైన డేటా ప్యాకెట్‌ను పంపడం ద్వారా సైబర్ అటాక్ జరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా అండ్రాయిడ్ వెర్షన్లు 13, 14, 15, మరియు 16 ముప్పు ఉందని తెలిపారు. దీనిని నివారించేందుకు తాజా ప్యాచ్‌ను ఇన్స్టాల్ చేయాలని సూచించారు. పరికర సెట్టింగ్‌లలో 2025-11-01 భద్రతా స్థాయికి అప్డేట్ చేసుకోవాలి. Google Play వంటి విశ్వసనీయ యాప్స్ నుండి మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. Play Protectని ఉపయోగించాలని, నికరమైన యాప్‌ల కోసం ఆటో స్కాన్ చేయడానికి దీన్ని యాక్టివ్‌గా పెట్టుకోవాలని సూచించారు.పర్సనల్ డేటాను రక్షించడానికి రెగ్యులర్ గా అప్డేట్లను చేక్ చేసుకొని, ఇన్ స్టాల్ చేసుకోవానలి సూచించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







