అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!

- November 09, 2025 , by Maagulf
అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!

వియన్నా: కువైట్ అవినీతికి వ్యతిరేకంగా పోటాటం చేస్తుందని, అదే సమయంలో మానవ హక్కులకు మద్దతుగా నిలుస్తుందని కువైట్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక సమావేశం (UNCAC) లో కువైట్ శాశ్వత ప్రతినిధి బృందం కార్యదర్శి మునిరా అల్-తయ్యర్ పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల అవినీతిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దేశాల సహకారాన్ని బలోపేతం చేయడానికి కువైట్ నిబద్ధతతో పనిచేస్తుందని అల్-తయ్యర్ తెలిపారు.  
ఇస్లామోఫోబియాను పర్యవేక్షించడానికి మరియు ముస్లింలపై ద్వేషాన్ని తొలగించడానికి UN యంత్రాంగాలను బలోపేతం చేయాలని కోరారు. సాయుధ పోరాటాల ద్వారా ప్రభావితమైన పిల్లలను రక్షించడానికి సమగ్రమైన విధానాలకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గాజా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, మయన్మార్, సూడాన్ మరియు ఇతర సంక్షోభ ప్రాంతాలలో పిల్లలపై జరుగుతున్న సంఘర్షణల తీవ్ర ప్రభావాన్ని హైలైట్ చేశారు. పిల్లల హక్కులను పరిరక్షించడంలో కువైట్ దీర్ఘకాల మానవతా నాయకత్వాన్ని అందిస్తుందని ఆమె తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com