రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు

- November 11, 2025 , by Maagulf
రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు

రెనో: రెనోలో నాట్స్,ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నెవెడాలోని రెనోలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది.ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ నార్త్ నెవాడా (IACCNN)తో కలిసి నాట్స్ నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి వైభవం, ఐక్యతా స్పూర్తిని ప్రతిబింబించాయి.రెనో నగరంలోని గ్రాండ్ సియెర్రా రిసార్ట్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సుమారు 300 మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో దీపావళి కాంతుల్లో సంతోషం వెల్లివెరిసింది.ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ గాయని సుమంగళి అందించిన సంగీత కచేరీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా సమన్వయం చేసిన లలితా నాయకత్వం అందరికీ స్ఫూర్తినిచ్చేలా నిలిచింది.లలితా కృషి నిబద్ధత, సత్సంకల్పం వల్ల దీపావళి వేడుకలు దిగ్విజయం అయ్యాయి. ఐఎసీసీఎన్ఎన్, నాట్స్  సంస్థల ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ  వేడుక ద్వారా భారతీయుల ఐక్యతను ప్రతిబింబించింది.  సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, భారతీయ విలువల పట్ల ఉన్న గౌరవాన్ని ఇది చాటింది. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి వివరించారు. ప్రవాస భారతీయులు కలిసి చేసుకునే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన అన్నారు. రెనో నగరంలో ప్రవాస భారతీయుల సమైక్యతకు ఈ దీపావళి వేడుకలే నిదర్శమని మధు బోడపాటి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com