భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 11, 2025
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒమన్-బహ్రెయిన్ దేశాలు నిర్ణయించాయి. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను కొనియాడారు.
ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు ఒమన్ మధ్య శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిర్ణయించారు. అదే సమయంలో ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను, అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







