సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- November 11, 2025
రియాద్: 2024 చివరి నాటికి సౌదీ అరేబియాలో సైనిక వ్యయం లోకలైజేషన్ 24.89 శాతానికి పెరిగిందని జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్ (GAMI) ప్రకటించింది. 2030 నాటికి 50 శాతానికి పైగా లోకలైజేషన్ సాధించే దిశగా ఇది నిరంతర పురోగతిని సూచిస్తుంది. రియాద్‌లో GAMI నిర్వహించిన మొదటి వార్షిక సైనిక ఇండస్ట్రీ రంగ సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. ఈ సందర్భంగా లోకలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.
సైనిక వ్యయం లోకలైజేషన్ రేటు సైనిక పరిశ్రమల రంగం అభివృద్ధిలో కీలకమైన మైలురాయిని సూచిస్తుందని తన ప్రసంగంలో GAMI గవర్నర్ ఇంజినీర్ అహ్మద్ అల్-ఓహాలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సలెన్స్ ఇన్ మిలిటరీ ఇండస్ట్రీస్ లోకలైజేషన్ అవార్డు విజేతలను ప్రకటించారు.
రక్షణ రంగంలో ఒక ముఖ్యమైన పారిశ్రామిక శక్తిగా సౌదీ అరేబియా సానుకూల ఇమేజ్‌ను వార్షిక సమావేశం ప్రతిబింబించింది. ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుందని వక్తలు వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







