ఇళయరాజాకు సపోర్ట్ చేసిన నిర్మాత శ్రీధర్
- November 11, 2025
ఇళయరాజాపై ఇటీవల విమర్శలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో తన పాత పాటలు వాడుకుంటున్నారని డబ్బులు కట్టాలంటూ అందరికి నోటీసులు పంపిస్తున్నారు. ఆ పాటల హక్కులు నావే అంటూ నోటీసులు పంపిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలను కూడా వదలట్లేదు ఇళయరాజా.
నిర్మాతలు ఆల్రెడీ రెమ్యునరేషన్ ఇచ్చి సాంగ్స్ కొన్న తర్వాత మీకెలా రైట్స్ ఉంటాయి అని, ఆడియో సంస్థలు కొనుక్కున్న తర్వాత మీకెలా రైట్స్ ఉంటాయని, ఇంత సక్సెస్, డబ్బు చూసి కూడా ఈ ఏజ్ లో డబ్బు కోసం వెంపర్లాట ఎందుకు అని ఇళయరాజాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా తెలుగు నిర్మాత, మధుర ఆడియో కంపెనీ అధినేత మధుర శ్రీధర్ తాజాగా ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మధుర శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కిన సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మ్యూజిక్ రైట్స్, ఇళయరాజాపై సమాధానం ఇచ్చారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమాల్లో మా మ్యూజిక్ వాడాలంటే మా పర్మిషన్ తీసుకోవాల్సిందే. దీనికి ఆడియో సంస్థలు భారీగా ఛార్జ్ చేస్తాయి. కానీ నేను ఉదారంగా ఉంటాను ఈ విషయంలో. చిన్న చిన్న సినిమాలు, కొత్తవాళ్లు సినిమాల్లో నా సాంగ్స్ వాడుకుంటే నేను డబ్బులు తీసుకోను కానీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇటీవల బాలీవుడ్ సినిమా మధుర ఆడియోలో ఉన్న సాంగ్ ఒకటి అడిగారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. గతంలో మ్యూజిక్ కి డబ్బులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు యూట్యూబ్ తో పాటు వివిధ వేదికలపై డిజిటల్ ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఎవరూ వదులుకోవట్లేదు. ఇళయరాజా గారు చేసేది కూడా కరెక్ట్. ఆయన పర్మిషన్ అయినా తీసుకోవాలి అని అన్నారు. దీంతో మధుర శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







