కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా పరమిత త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమెకు విమానాశ్రయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సంజయ్ కె. ములుకా, కువైట్ ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద భారత అమర వీరులకు నివాళులర్పించారు. దేశ సేవలో వారి అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్ మరియు కువైట్ మధ్య వృద్ధి, పునరుద్ధరణ మరియు శాశ్వత భాగస్వామ్యానికి ప్రతీకగా ఆమె రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఒక వేప మొక్కను నాటారు. రాయబారి త్రిపాఠి బాధ్యతలు స్వీకరించడం భారతదేశం-కువైట్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పలువురు ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







