కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అబ్దుల్మొహ్సేన్ జాబర్ అల్-జైద్‌ను కలిసి, తన నియామక ఉత్తర్వుల కాపీని అందజేశారు. భారత్ -కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని వారు సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు ప్రజలకు మధ్య సహకారాన్ని పెంపొందించడానికి నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించారు.
కువైట్‌లో భారత మొదటి మహిళా రాయబారిగా మరియు గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన రెండవ మహిళగా తనకు లభించిన గొప్ప గౌరవం, ఆనందాన్ని కూడా ఇచ్చిందని రాయబారి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య స్నేహానికి శాశ్వత వారధిగా ఉండటానికి కువైట్‌లోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీ అందిస్తున్న సహకారాన్ని ఆమె ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







