దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!

- November 11, 2025 , by Maagulf
దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!

దుబాయ్: భారత్ కు చెందిన ముగ్గురు పిల్లల తండ్రి రెండేళ్ల క్రితం దుబాయ్ కనిపించకుండా పోయాడు. రాజస్థాన్‌లోని జుంజును నగరానికి చెందిన 39 ఏళ్ల రాకేష్ కుమార్ జాంగిద్, జూలై 2023లో దుబాయ్‌లో కనిపించకుండా పోయిన రోజు నుండి తమ జీవితాలు తలకిందులయ్యాయని అతని కుటుంబం ఆవేదన చెందుతోంది.

రాకేష్ జూన్ 21, 2023న 60 రోజుల టూరిస్ట్ వీసాపై యూఏఈలో అడుగుపెట్టాడు.  గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్‌లో పనిచేసిన నైపుణ్యం కలిగిన మార్బుల్ ఇన్‌స్టాలర్, దుబాయ్‌లో ఉద్యోగం కోసం అడుగుపెట్టాడు. మొదటి రెండు వారాల పాటు, అతను ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసేవాడు. జూలై 6 అతడు చివరి కాల్ చేసాడని అతని కుటుంబం తెలిపింది.  ఎదో గొడవలో ఇరుక్కున్నానని, సిమ్ కార్డ్ లేదని పేర్కొన్నాడని పేర్కొన్నారు. కనిపించకుండా పోయిన ఎనిమిది నెలల తర్వాత, మార్చి 2024లో రాకేష్ జైలులో ఉన్నాడని ఏజెంట్ చెప్పాడని, అతనికి సహాయం చేయడానికి ఎవరైనా దుబాయ్‌కు రావాలని పేర్కొంటూ వారికి వాయిస్ నోట్ పంపినట్లు వాపోయారు. 

వెంటనే రాకేశ్ సోదరుడు మఖాన్ యూఏఈకి వెళ్లాడు. అక్కడ ఆసుపత్రులు, జైళ్లు మరియు మార్చురీలను కూడా వెతికానని, చివరకు ఎంబసీ మరియు కాన్సులేట్ అధికారులను కలిశానని,  అల్ మురఖ్ఖబాత్ పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేసాను. కానీ ఇప్పటివరకు అతని జాడ లేదని మఖాన్ తెలిపారు.  రాకేష్ ఏదో విధంగా తిరిగి రావాలని అతడి కుటుంబం ప్రతిరోజూ ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 

తాజాగా రాకేష్ 18 ఏళ్ల కుమార్తె ఖుషి తన తండ్రి ఫ్రేమ్ చేసిన ఫోటోను పట్టుకుని సహాయం కోసం వేడుకుంటున్న వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి తమ తండ్రిని కనుగొనడంలో తమకు సహాయం చేయాలని ఆమె వేడుకుంది.  

కాగా, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆగస్టు 2023 నుండి స్థానిక అధికారులతో కేసును ఫాలో అవుతున్నట్లు తెలిపారు.  రాకేష్ వీసా గడువు ఆగస్టు 19, 2023న ముగిసిందని, అతనిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com