‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- November 13, 2025
మనామా: బహ్రెయిన్ లో జపాన్ రాయబార కార్యాలయం మల్కియా బీచ్‌లో ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ పేరిట నిర్వహించిన బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ విజయవంతమైంది. 300 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థ రక్షణకు తమ వంతు సహకారాన్ని అందించారు. బీచ్ నుండి అనేక వ్యర్థాలను తొలగించారు.
సముద్ర రక్షణను పెంపొందించడానికి జపాన్ రాయబార కార్యాలయం నిబద్ధతతో పనిచేస్తుందని బహ్రెయిన్ లోని జపాన్ రాయబారి అసాకో ఓకేఐ వెల్లండించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 4 వరకు జరిగే జపాన్ అనిమే ఫెస్ట్ లో భాగంగా ఉత్తమ ప్రశంసలు అందుకున్న ఎనిమిది జపనీస్ యానిమేటెడ్ సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జపాన్ - బహ్రెయిన్ మధ్య బంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా రాయబార కార్యాలయం భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







