రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- November 13, 2025
రియాద్: రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ మరియు కల్చర్ అకాడమీ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి ప్రిన్స్ బాదర్ బిన్ అబ్దుల్లా మరియు విద్యాశాఖ మంత్రి యూసఫ్ అల్-బెన్యన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రియాద్‌లోని అకాడమీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక నైపుణ్యాల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.
అఫాక్ ఆర్ట్స్ మరియు కల్చర్ అకాడమీ స్థాపన జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలో ఒక మార్గదర్శక అడుగు అని వక్తలు కొనియాడారు. సౌదీ అరేబియాలో ఇదే మొదటిది అని తెలిపారు. ఈ అకాడమీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో సాంస్కృతిక ప్రతిభను పెంపొందించడానికి ఒక సమగ్ర నమూనాగా పనిచేస్తుందన్నారు. బాయ్స్ కోసం రియాద్‌లో మరియు గర్ల్స్ కోసం జెడ్డాలో అకాడమీలను వేర్వేరుగా ఏర్పాట చేసినట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు, థియేటర్లు మరియు ప్రత్యేక స్టూడియోలతో కూడిన అకాడమీ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







