AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం

- November 14, 2025 , by Maagulf
AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం

తిరుమల: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగించి చాట్బాట్ ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, గదుల లభ్యత విరాళాలు ఇతర సేవలకు సంబం ధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందే వెసలుబాటు టిటిడి(TTD) అందుబాటులోకి తీసుకువస్తోంది. అమెజాన్ వెబ్సర్వీస్తో కలసి ఏర్పాటు కానున్న ఈ సాంకేతికతతో ఏకంగా 13 భాషల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.దర్శనం, వసతి, విరాళాల వంటి వివరాలు క్షణాల్లో భక్తులు తెలుసుకునే సదుపాయం రానుంది. ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్సర్వీసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఏఐ ఆధారిత చాట్బాట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టిటిడి ప్రకటించింది. భక్తులు తమ ఫిర్యాదులు, సూచనలను సలహాలు కూడా చాట్బాట్ ద్వారా టిటిడి దృష్టికి తీసుకెళ్ళే వెసలుబాటు కలగనుంది.

ఈ చాట్బాట్లో స్పీచ్ టు టెక్స్ట్ (మాట్లాడితే పదాలుగా), టెక్స్ టు స్పీచ్ ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్బాట్కు అవసరమైన సాఫ్ట్వేరు ఐటి దిగ్గజం టిసిఎస్ అభివృద్ధి చేస్తోంది. టిటిడి పాలనలో పారదర్శకత పెంపొందించడంతోబాటు ఎస్వీబిసి ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నారు. వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిరీక్షణ లేకుండా సకాలంలో వీలైనంత త్వరగా భక్తులకు దేవుని వీక్షణభాగ్యం కలిగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు.సిఎం చంద్రబాబు ఆదేశాలతో టిటిడి చైర్మన్ బొల్లినేని రాజ గోపాల్ నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి కృత్రిమమేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహకారం టిసిఎస్తో ఒప్పందం కుదుర్చుకుని అమలుచేయనున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్లో సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే.దర్శన విధివిధానాలు, వస్త్రధా రణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com