ప్రపంచంలోనే భారీ ఉభయచర విమానాన్ని చైనా ఆవిష్కరించింది..
- July 24, 2016
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఉభయచర విమానాన్ని చైనా ఆవిష్కరించింది. కార్చిచ్చును ఆర్పడానికి, సముద్రంలో కార్యకలాపాలు వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి విదేశీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న చైనా వైమానిక రంగానికి ఇదో ముందడుగు.
ఏజీ600 అనే ఈ విమానాన్ని ఝుహాయ్ నగరంలోని కర్మాగరంలో ఆవిష్కరించారు. 53.5 టన్నుల బరువుతో గాల్లోకి లేవగలదు. గరిష్ఠంగా 4500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 20 సెకన్లలోనే 12 టన్నుల నీటిని సేకరించగలదు. ఇది దాదాపుగా బోయింగ్ 737 విమానం పరిమాణంలో ఉంటుంది. ఇది నేలతోపాటు నీటిపై నుంచి కూడా పైకి లేవగలదు, దిగగలదు. జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి పొరుగు దేశాలతో సముద్ర సరిహద్దు వివాదమున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో తన కార్యకలాపాలకు ఈ విమానం తోడ్పాటు అందిస్తుందని చైనా భావిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







