డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు రోడ్డున..
- July 24, 2016
డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు రోడ్డున పడుతున్నాయని 'తెలుగు టెలివిజన్ యూనియన్' మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. ఫిలిం చాంబర్లో 'తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ యూనియన్' సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'డబ్బింగ్ సీరియళ్లతో ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉపాధి కోల్పోతున్నారు. వీటిని ఆపేయాలని ఒకసారి ఉద్యమం చేశాం.
మరోసారి ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకుంటామ'ని చెప్పారు. అనంతరం బుల్లితెర నటీనటుల డైరెక్టరీని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత గురురాజ్, టీవీ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు సంఘం అధ్యక్షుడు వినోద్‌బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, నటులు శివాజీ రాజా, రామ్‌జగన్, నాగమణి, సుబ్బారావు పలువురు టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు







