ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- November 15, 2025
రియాద్ః వెస్ట్రన్ ఫ్లీట్‌లోని కింగ్ ఫైసల్ నావల్ బేస్‌లో నావల్ ఎక్సర్సైజ్ "రెడ్ వేవ్ 8" ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అల్-ఘురైబి, బోర్డర్ గార్డ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ షాయా అల్-వదానీ హాజరయ్యారు. రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ నిర్వహించిన ఈ డ్రిల్‌లో జోర్డాన్, ఈజిప్ట్, జిబౌటి, సూడాన్ మరియు యెమెన్‌లతో సహా రెడ్ సీ తీరప్రాంత దేశాల నుండి నావల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆధునిక రక్షణ వ్యవస్థల పనితీరుతోపాటు యుద్ధ వ్యూహాలను ప్రదర్శించారు.
ఈ ఎక్సర్ సైజులో మల్టీ ల్యాండింగ్‌లు, సైనికుల పోరాటం, తీరప్రాంత రక్షణ కార్యకలాపాలు, నిఘా, తీరప్రాంత లక్ష్యాలపై దాడులు, ఉగ్రవాద నిరోధక కసరత్తులు, బందీల రక్షణ మిషన్ల వంటి ఆపరేషన్లను నిర్వహించారు. ప్రాంతీయ ముప్పులను అరికట్టడానికి భద్రతా వ్యవస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం ఈ డ్రిల్ లక్ష్యమని ఎక్సర్ సైజ్ డైరెక్టర్ రియర్ అడ్మిరల్ అబ్దుల్లా అల్-అంజి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







