CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- November 15, 2025
విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు(Vizag meeting) తొలిరోజు పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. శుక్రవారం ముఖ్యమంత్రి సమక్షంలో 41 ఒప్పందాలు, మంత్రుల సమక్షంలో మరో 324 ఒప్పందాలు జరిగాయి. మొత్తం 365 కంపెనీలు రూ.8,26,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తద్వారా 12,05,174 ఉద్యోగాలు రానున్నాయి. ఈరోజు వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికంగా 121 వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందినవే ఉన్నాయి. తర్వాత స్థానంలో ఐటీఈ అండ్ సీ 95, విద్యుత్ రంగానికి చెందిన సంస్థలు 44 రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నాయి. సీఐఐ సమ్మిట్ రెండు రోజులు కలిపి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనావేయగా, అందరి అంచనాలను మించి ఒక్కరోజులోనే పెట్టుబడులు రావడం రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసింది.
సిఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒకేసారి 41 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ 41 సంస్థలు మొత్తం రూ.3,50,186 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టనున్నాయి. దీంతో 4,16,290 మందికి ఉద్యోగాలు(Vizag meeting) దక్కనున్నాయి. ఎంఓయూ చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఎల్, జెఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్. హిందుస్థాన్ షిప్యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధనరెడ్డి, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
సమ్మిట్కు ముందు రోజు 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయి. 1,26,471 రానున్నాయి. మొత్తంగా గురు, శుక్రవారాలు రెండ్రోజుల్లో రాష్ట్రానికి రూ.11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 400 సంస్థలు పెడుతున్న ఈ పెట్టుబడులతో 13,32,445 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
తాజా వార్తలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత







