కారు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఆన్లైన్లో మాత్రమే
- July 24, 2016
కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ (మూడేళ్ళలోపు) కేవలం ఆన్లైన్లో ద్వారా మాత్రమే ఇక నుంచి జరుగుతుంది. ఆగస్ట్ 15 నుంచి ఆర్టిఎ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మరో రెండు సర్వీసులు ఆన్‌లైన్‌లోకి ఆగస్ట్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రీప్లేస్మెంట్ లేదా పోగొట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్డ్‌ని తిరిగి పొందడం, అలాగే లైసెన్స్ ప్లేట్ రిటెన్షన్ వంటివి ఆర్టిఏ వెబ్సైట్ ద్వారా పొందనడానికి వీలుంది. డ్రైవర్స్ అండ్ వెహికిల్స్ యాప్, ఆర్టిఎ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. టెస్టింగ్ అవసరం లేని వాహనాల రిజిస్ట్రేషన్, పోగొట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్డ్‌ని కొత్తగా పొందడం, నంబర్ రెన్యువల్ రిటెన్షన్ సర్వీస్ వంటివి ఆన్లైన్లో మాత్రమే జరుగుతాయనీ, అయితే దీనికిగాను వాహనాలు మూడేళ్ళ లోపు వయసున్నవి మాత్రమే అయి ఉండాలని ఆర్టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ బహ్రూజియన్ చెప్పారు. ఆన్లైన్ ద్వారా సమయం వృధాని అరికట్టగలుగుతున్నామనీ, మెరుగైన సేవలు తేలిగ్గా అందరికీ అందజేయగలుగుతున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







