యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- November 17, 2025
యూఏఈ: భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండవ దశ మొదలైంది. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా, మరికొందరు డిసెంబర్ 9న తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
"ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు గత ఓటరు ID కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫారమ్లకు ఫిల్ చేసి పంపాను" అని దుబాయ్ నివాసి అషీమ్ పికె తెలిపారు.
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ, కర్ణాటకతో సహా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో SIR విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం, తప్పుడు ఎంట్రీలను తొలగించడం, కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతుంది.
చాలా మంది ప్రవాస భారతీయులకు (NRI) ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశమని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరికే అన్నారు. ఇండియాలో NRI ఓటరు నమోదు 2010లో ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 2011లో NRIలను “విదేశీ ఓటర్లు”గా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







