'హ్యాపీ బర్త్ డే'.. ఒక యథార్థ సంఘటన
- July 24, 2016
చెన్నమనేని శ్రీధర్, జ్యోతిసేథీ, సంజన, శ్రవణ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. పల్లెల వీరారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కల్లే నిర్మాత. జి.సంతోష్రెడ్డి స్వరకర్త. హైదరాబాద్లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. తొలి సీడీని ఎమ్మెల్యే బాలరాజు ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్య ఓ జంటకి ఏం జరిగిందనేదే ఆసక్తికరం. కథకు తగ్గట్టుగా సంతోష్రెడ్డి సంగీతం అందించార''న్నారు. ''ఆసక్తిరేకెత్తించే కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. అందరినీ మెప్పించే ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత. ''శ్రీధర్ మంచి నటుడు. ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్న తను మరింత గుర్తింపు సొంతం చేసుకొంటాడు. పాటలు, ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి'' అన్నారు బొంతు రామ్మోహన్. కార్యక్రమంలో బి.గోపాల్, సంజన, కపిల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







