భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపు
- July 24, 2016
చైనాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలన్న భారత్ నిర్ణయంపై చైనా మీడియా బెదిరింపులకు దిగింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లో సభ్యత్వానికి చైనా మద్దతు పలుకలేదన్న కక్షతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారతీయులకు తమ దేశ వీసాలు ఇవ్వడం చైనా మరింత కష్టతరం చేసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల చైనాలో ఉంటున్న భారత జర్నలిస్టులపై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఆ ముగ్గురు జర్నలిస్టుల కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో తమకు మద్దతు ఇవ్వకపోవడంపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవ అని జాతీయ టాబ్లయిడ్ గ్లోబల్ టైమ్స్ ఆదివారం హెచ్చరించింది. వీసాల విషయంలో భారత్ చర్యలకు తమ ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయని, కొందరు భారతీయులకు వీసాలు దొరకడం ఇక కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







