రిథమిక్ జిమ్నాస్టిక్స్‌ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!

- November 18, 2025 , by Maagulf
రిథమిక్ జిమ్నాస్టిక్స్‌ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!

కువైట్: 9 ఏళ్ల భారతీయ జిమ్నాస్ట్ వానియా ఖాన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తన అద్భుతమైన విజయాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.  ప్రపంచ వేదికపై కువైట్‌కు గర్వకారణంగా ప్రాతినిధ్యం వహిస్తుంది.

టర్కీలో తన మొదటి అంతర్జాతీయ ప్రదర్శనతో వానియా తన పోటీ ప్రయాణాన్ని ప్రారంభించింది.  దుబాయ్‌లో జరిగిన తన రెండవ పోటీలో రజత , కాంస్య పతకాలను గెలుచుకుంది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు, ట్రోఫీని గెలుచుకుంది. ఆ తరువాత కజకిస్తాన్‌లోని అల్మట్టిలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు బంగారు పతకాలను సాధించింది.

SALTO జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ ఎలెనా పర్యవేక్షణలో వానియా శిక్షణ పొందింది. తను చదివిన ఫహాహీల్ అల్ వటానియా ఇండియన్ ప్రైవేట్ స్కూల్ (FAIPS) మద్దతును అందజేసింది. తన విజయ పరంపరను కొనసాగిస్తూ, వానియా ఇటీవల సెప్టెంబర్ 27న జరిగిన డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో రెండు బంగారు పతకాలను, ఆ తర్వాత నవంబర్ 2, 2025న జరిగిన 42వ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలను మరియు ఒక కాంస్య పతకాన్ని గెలుచుకని సత్తా చాటింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com