‘అఖండ: తాండవం’ నుంచి ‘జాజికాయ’ సాంగ్ రిలీజ్

- November 18, 2025 , by Maagulf
‘అఖండ: తాండవం’ నుంచి ‘జాజికాయ’ సాంగ్ రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఎస్ థమన్  #BB4 అఖండ 2: తాండవం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అఖండ- 2 నుంచి సెకండ్ సింగిల్‌గా 'జాజికాయ' అంటూ సాగే పవర్‌ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అయింది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అత్యద్భుతమైన క్యాచీ లిరిక్స్‌తో రాయగా..స్టార్ సింగర్స్ శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ని అద్భుతంగా అలరించనున్నాయి. భాను మాస్టర్ కంపోజ్ చేసిన బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో గ్రాండ్‌గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు హాజరై ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘సింహాచలం అప్పన్న ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చాం. మొన్న మన దెబ్బేంటో ముంబైలో హిందీవాళ్లకు చూపించాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అఖండ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. కోవిడ్ టైమ్‌లోనే అఖండ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయిన పాట ఐటమ్ సాంగ్ కాదు. కుటుంబం పండగ చేసుకునే నేపథ్యంలో వచ్చే సాంగ్. పాటలో సంయుక్తను చూశారు కదా.. ఆమె ఎంతో అందంగా ఉంది. సినిమాలో ఆమె నటన కూడా చూస్తారు. ఆమె హావభావాలు ఎంతో అద్భుతంగా పలికించి తన పాత్రకు న్యాయం చేసింది.అఖండలో జై బాలయ్య పాటను కంపోజ్ చేసిన భాను మాస్టర్ ఈ జాజికాయ పాటను అద్భుతంగా కంపోజ్ చేశాడు. మా నందమూరి తమన్ ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కాసర్లశ్యామ్ గారు పాటను బాగా రాశారు. శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా అంతే అద్భుతంగా పాడారు. అఖండతో అందరి అంచనాలు పెరిగాయి. అందుకే ఈ అఖండ తాండవం సినిమా వాటిని అందుకునేలా ఉంటుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. వాళ్లు అదృష్టవంతులు. సినిమాకు పనిచేసిన అందరూ అదృష్టవంతులు. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం శక్తి, పరాక్రమాన్ని చాటిచెప్పే చిత్రం. మన జాతి మూలాలు ఏంటో తెలియజేసే సినిమా. అందుకే అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. రేపు కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రమోట్ చేస్తాం. తర్వాత తమిళనాడుకు వెళ్తాం. మొన్న ముంబైలో మన దెబ్బకు హిందీవాళ్లకు దిమ్మతిరిగిపోయింది. ఇక్కడకు వచ్చిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..‘‘లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఇక్కడకు వచ్చాం. ముంబైలో కూడా సిద్ధివినాయక స్వామి ఆశీస్సులు తీసుకుని అఖండ తాండవం సాంగ్ రిలీజ్ చేశాం. ఈ సాంగ్ ఎలా ఉందో చూశారు కదా.. సాంగ్‌లో ఇంకో పార్శాన్ని కూడా చూస్తారు. ఈ సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. సినిమాలో అనంతపూర్‌లో జరిగే బర్త్ డే పార్టీలో వచ్చే పాట ఇది. సంయుక్త మీనన్ చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఇది. ఆ అమ్మాయిలో ఏదైనా చేయగలననే కసి ఉంది. ఈ సాంగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 5న విడుదలయ్యే సినిమాను కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. భాను మాస్టర్ మాకు అన్నీ మంచి సాంగ్స్ చేశారు.  ఈ సాంగ్ ఇంత అద్భుతంగా చేయడానికి ప్రధాన కారణం నా ప్రొడ్యూసర్స్. ఖర్చు గురించి ఆలోచించకుండా ఏమైనా చేయండి అని భరోసా ఇచ్చారు. తమన్‌కు సిట్యువేషన్ చెప్తే అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. ఆర్ఆర్ డీటీఎస్ మిక్సింగ్ జరుగుతున్నాయి. దాంతో పాటు త్రీడీ వర్క్ కూడా చేస్తున్నాం. డిసెంబర్ 5న అందరూ తప్పకుండా సినిమాను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాలనికోరుతున్నా. నాకు ఊపిరున్నంత వరకు బాలయ్యబాబుకు ఓపిక ఉన్నంత వరకు మా కాంబినేషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది.’’ అన్నారు.

హీరోయిన్ సంయక్త మాట్లాడుతూ...‘‘మీకు సాంగ్ నచ్చిందా లేదా అని నాకు అర్థమైపోయింది. లేదనే ఆప్షనే లేదు. మీకు ఎంతో బాగా నచ్చిందని నాకు తెలుసు. అఖండ తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. తెలుగు కమర్షియల్ సినిమాలకు నేను పెద్ద అభిమాని. బాలయ్య-బోయపాటి కాంబోకి కూడా నేను ఫ్యాన్. నా పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ రివీల్ చేయడం లేదు. బాలయ్య బాబు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఈ పాట ఉంటుంది. ఇది నా ఫస్ట్ స్పెషల్ సాంగ్. భాను మాస్టర్ ఎంతో బాగా కంపోజ్ చేశారు. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. వీడియో సాంగ్ చాలా బాగుంటుంది. సినిమా అందరూ తప్పకుండా చూడండి.’’ అన్నారు.

నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ..‘‘మంచి హైఓల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. బాలయ్య ఎనర్జీకి, స్టైయిల్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. బోయపాటిగారు సాంగ్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. భాను మాస్టర్ మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. సంయుక్త చాలా బాగా డ్యాన్స్ చేసింది. తమన్ అదిరిపోయే సంగీతం అందించారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్‌ మొత్తం నాలుగు నిమిషాలు ఉర్రూతలూగిపోతుంది. ముఖ్యంగా లాస్ట్ 45 సెకెన్స్ అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు పండగే. జై బాలయ్య’’ అని అన్నారు.


 
ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌.  

‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com