సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- November 19, 2025
యూఏఈ: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది భారతీయులే.ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఇప్పుడు సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ షోయాబ్‌గా గుర్తించారు. అతను ఇదే ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయాడని వారి బంధువు మీడియాకు తెలిపారు.
ఈ విషాద ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 3 తరాలు మరణించాయి. 9 మంది పిల్లలు సహా 18 మంది మరణించారు.మొత్తంగా ప్రమాదంలో 28 మంది మహిళలు, 17 మంది పురుషులు మరణించారు. బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణలో మరియు జెడ్డాలో భారత మిషన్ ద్వారా హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. మదీనాలో బస్సు ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని సౌదీ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత, మృతదేహాలకు వారి మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







