ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

- November 19, 2025 , by Maagulf
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అడవి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టుల (AP) మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు దేవ్‌జీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటన తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడవి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌ను పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధృవీకరించారు. ఆయన వివరాల్లో భాగంగా చెప్పారు తాజా కాలంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లోకి(AP)చొరబడే ప్రయత్నాలు పెరిగాయని, దీనిని ఎదుర్కొనేందుకు నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని తెలిపారు. నవంబర్ 17న ప్రారంభించిన ఆపరేషన్‌లో భాగంగా, 18వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగి హిడ్మా మద్వితో సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ప్లాటూన్ సభ్యులు, ఏరియా కమిటీ నాయకులు ఉన్నారు. ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com