ఈ వీకెండ్ ఖతార్‌లో జరిగే స్పెషల్ ఈవెంట్స్..!!
- November 20, 2025
దోహా: ఖతార్‌లో ఈ వారాంతంలో అనేక ఈవెంట్లు జరుగనున్నాయి. వాటిలో స్పోర్ట్స్, ప్రపంచ స్థాయి ఎంటర్ టైన్ మెంట్, క్లాసిక్ కార్ల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వీకెండ్ లో సిద్ధంగా ఉన్నాయి.
UFC ఫైట్ నైట్
నవంబర్ 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు అలీ బిన్ హమద్ అల్ అత్తియా అరీనాలో జరుగుతుంది. లైట్ వెయిట్ విభాగంలో అర్మాన్ త్సారుక్యాన్ వర్సెస్ డాన్ హుకర్ తలపడుతుండగా, వెల్టర్ వెయిట్ విభాగంలో బెలాల్ ముహమ్మద్ వర్సెస్ ఇయాన్ మచాడో గ్యారీ మ్యాచ్ జరుగనుంది.
ఖతార్ లగ్జరీ క్లాసిక్ కార్ల పోటీ మరియు ప్రదర్శన నవంబర్ 23 వరకు జరుగుతుంది. ఉదయం 11 నుండి అర్ధరాత్రి వరకు మదీనా సెంట్రల్ వేదికగా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ 61 అరుదైన మరియు ఐకానిక్ గల్ఫ్ క్లాసిక్ కార్లను చూడవచ్చు. ప్రవేశం ఉచితం.
థీబ్ అల్ట్రా మారథాన్ 2025 నవంబర్ 21, 22 తేదీల్లో జెక్రీత్ లో ప్రారంభం అవుతుంది. ఎడారి మారథాన్‌లో పిల్లల విభాగాలతో సహా 5 కి.మీ నుండి 50 కి.మీ వరకు ఈవెంట్లు ఉన్నాయి. రన్నర్లు మరియు సైక్లిస్టులు ఇద్దరికీ వేర్వేరుగా రేసులు నిర్వహిస్తున్నారు. QSFA యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు.
DBRQ 1వ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ టోర్నమెంట్ లుసైల్ మెరీనా ప్రొమెనేడ్ లో నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 5 నుండి 11 వరకు జరుగుతుంది. ఇది ఖతార్‌లోని మొట్టమొదటి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ గా గుర్తింపు పొందింది.
ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (QNCC) లో గ్రాండ్ ఆటో షో 2025 నవంబర్ 22 వరకు ఉంటుంది. ఖతార్‌లోని అతిపెద్ద ఆటోమోటివ్ షో ఇది. 50వేల చదరపు మీటర్ల ఇండోర్-అవుట్డోర్ స్థలంలో 300 ప్రత్యేకమైన కార్ల షోను చూడవచ్చు.
ఖతార్‌లోని అతిపెద్ద పాప్-కల్చర్ ఫెస్టివల్ గేమింగ్, కాస్ప్లే, అనిమే, ఆర్ట్, మ్యూజిక్ మరియు పోటీలతో గీక్డమ్ 2025 తిరిగి వస్తుంది. లుసైల్ బౌలేవార్డ్ లో నవంబర్ 22వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!







