నారారోహిత్కు జన్మదిన శుభాకాంక్షలు...
- July 25, 2016
అతని సినిమాలు 'బాణం'లా దూసుకొస్తాయి. బాణాల్లో వైవిధ్యమైన అస్త్రాలు ఉన్నట్లు కథలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. 'సోలో'గా వచ్చి సక్సెస్‌ను సాధించగలడు. సినిమాను తన భుజస్కందాలపై మోసే 'ప్రతినిధి'లా కనిపిస్తున్నా.. అప్పుడప్పుడు 'రౌడీఫెలో'గా మారుతుంటాడు. అంతలోనే 'తుంటరి' పనులు చేస్తుంటాడు. మరి ఆ 'రాజా చెయ్యివేస్తే..' సినిమా విభిన్నంగా ఉన్నట్లే.. ఏడాదంతా సినిమాలతో బిజీబిజీగా ఉండే ఆ యువకథానాయకుడు నారా రోహిత్. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ..
తొలిచిత్రం 'బాణం'తోనే వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకునే కథానాయకుడిగా పేరు సంపాదించారు నారా రోహిత్. చైతన్య దంతులూరి తెరకెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొంది. సాధారణ చిత్రాలకు భిన్నంగా ఉందంటూ అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత నారారోహిత్ కూడా యువ దర్శకులతో సినిమాలు చేస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అలా వచ్చినవే సోలో.. సారొచ్చారు.. ఒక్కడినే.. ప్రతినిధి.. రౌడీ ఫెలో.. అసుర.. తుంటరి.. సావిత్రి.. రాజాచెయ్యివేస్తే.. వీటిలో ప్రతీ సినిమా వైవిధ్యమైన కథలతో తెరకెక్కినవే.
ఈ ఏడాది ఇప్పటికే మూడు చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం శంకర.. పండగలా వచ్చాడు.. అప్పట్లో ఒకడుండేవాడు.. వీరుడు.. కథలో రాజకుమారి.. జో అచ్యుతానంద.. తదితర చిత్రాల్లో నారారోహిత్ నటిస్తున్నారు. కథల ఎంపిక గురించి నారా రోహిత్‌ను ప్రశ్నిస్తే.. 'మా పెదనాన్న ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నా కోసం కథలు పుట్టేయవు కదా? ఆ నేపథ్యం వాడుకోవాలనుకొంటే రాజమౌళి లాంటి పెద్ద పెద్ద దర్శకులతోనే సినిమాలు చేసే వాడిని. నాకు ఎలాంటి కథలు నప్పుతాయో బాగా తెలుసు.. నా తొలి ప్రాధాన్యం కథకే' అంటారు.
ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్పండి అంటే.. 'పార్టీలకు, ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నేను చేస్తున్న సినిమాను ప్రేమించి మరీ చేస్తాను. నాకు ఇష్టమైన నటులు పెద్ద ఎన్టీఆర్.. సూర్య. ఇక నా డ్రీమ్ రోల్ గురించి చెప్పాలంటే ఎప్పటికైనా దుర్యోధనుడి పాత్ర వేయాలని ఉంది' అంటారు. ఇలాగే వైవిధ్యమైన కథలతో మరిన్ని చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ నారారోహిత్కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







