పోలీస్ అధికారిగా రానున్న రెహమాన్
- July 25, 2016
ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో దర్శకుడిగా మారారు కార్తిక్ నరేన్. ఇప్పటికే 'నిరంగల్ మూండ్రు', 'వూమైకురళ్', 'ప్రతి' అనే లఘుచిత్రాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'ద్రువంగల్ పదినారు' అనే సినిమా తీస్తున్నారు. దీనికి సుజిత్ సరంగ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జేక్స్ పిచాయ్ సంగీతం అందిస్తున్నారు. 16 గంటల్లో జరిగే ఓ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 16 పాత్రలు ఉంటాయి. వీటిలో రెహమాన్ పోషించే పాత్ర కీలకం. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ... ''ఇందులో పాత్రలన్నీ వేటికవే అన్నట్లు ఉంటాయి. ఎంతో ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకుని దీన్ని రూపొందిస్తున్నాం. రెహమాన్ ఇందులో ఓ పోలీసు అధికారి పాత్రను పోషించారు. విధులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ఘటనతో దివ్యాంగుడిగా మారిపోతారు. ఈ కారణంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు. అయినప్పటికీ ఓ కేసుకు సంబంధించి ఆయన విచారణ జరపాలని భావిస్తారు. అలా కొందరు సాక్షులతో మాట్లాడి కీలక విషయాలు సేకరిస్తారు. ఈ కథ అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. ప్రేమ పాటలు, సన్నివేశాలు వంటివి ఏమాత్రం ఉండవు. స్క్రీన్‌ప్లేకు అనవసరమైన ఏ సన్నివేశాన్నీ చేర్చలేదు. కోవై నేపథ్యంలో చిత్రీకరించాం. మొత్తం 23 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. వీలైనంత త్వరలోనే సినిమాను తెరపైకి తీసుకొస్తామ''ని చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







