సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- November 21, 2025
లివా: నార్త్ అల్ బటినా గవర్నరేట్‌లోని లివా డ్యూయల్ క్యారేజ్‌వే లింక్‌ను ఒమన్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ ప్రారంభించింది. 5.5-కి.మీ ఉండే ఈ లింక్ సుల్తాన్ కబూస్ రోడ్‌లోని లివా రౌండ్‌అబౌట్ మరియు అల్ బటినా ఎక్స్‌ప్రెస్‌వే ఇంటర్ సెక్షన్ లను కలుపుతుంది.
ఈ ప్రాజెక్ట్ నాలుగు ప్రధాన ప్యాకేజీలను కలిగి ఉంది. ప్రస్తుత క్యారేజ్‌వే రెండు దిశలో రెండు లేన్‌లతో 22.1 మీటర్ల క్రాస్-సెక్షన్‌తో డ్యూయల్ క్యారేజ్‌వేగా నిర్మించారు. ఇందులో పలు ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్ ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లను నిర్మించారు.
ఈ రహదారి లివా విలాయత్ కేంద్రం మరియు సమీప గ్రామాల మధ్య రోడ్ కనెక్టివిటీ కల్పించడంతోపాటు వాణిజ్య కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ తెలిపింది. అలాగే, సోహార్ పోర్ట్ మరియు సోహార్ ఫ్రీ జోన్‌ను కలిపే మరో రోడ్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







