సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- November 21, 2025
వాషింగ్టన్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా పర్యటన విజయవంతం అయింది. తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చారిత్రాత్మక స్నేహ బంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.
క్రౌన్ ప్రిన్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు సౌదీ-యుఎస్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించేలా పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా వ్యూహాత్మక రక్షణ ఒప్పందం, AI వ్యూహాత్మక భాగస్వామ్యం, పౌర అణు సహకారంపై చర్చలు జరిపారు.
యుఎస్-సౌదీ పెట్టుబడి ఫోరంలో క్రౌన్ ప్రిన్స్ మరియు అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు $270 బిలియన్ల విలువైన ఒప్పందాలను ప్రకటించారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







